టాప్ 10 లో రానా నాయుడు సిరీస్

టాప్ 10 లో రానా నాయుడు సిరీస్

Published on Mar 15, 2023 6:03 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్, రానా నాయుడుతో తన ఓటిటి అరంగేట్రం చేసాడు. ఇందులో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 10, 2023న విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. అధిక వీక్షకుల సంఖ్యను సంపాదించడం ద్వారా అరుదైన ఘనతను సాధించడం జరిగింది.

ఇది గ్లోబల్ టాప్ 10 సిరీస్ లిస్ట్‌లో స్థానం సంపాదించింది. ఖాకీ: ది బీహార్ చాప్టర్ మరియు యంగ్ అడల్ట్ షో క్లాస్ వంటి ఇతర భారతీయ సిరీస్‌లలో, రానా నాయుడు వాటిని బ్రేక్ చేశాడు. ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తున్నాడు. తెలుగు మార్కెట్ నుండి ఇద్దరు ప్రముఖ నటులను కలిగి ఉన్న మొదటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్, వీరి స్టార్ పవర్ తో భారీ వ్యూస్ ను సాధించింది.

మొదటి వారంలో, రానా నాయుడుకి 8,070,000 గంటల వ్యూస్ వచ్చాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన 10వ ఆంగ్లేతర సిరీస్‌గా నిలిచింది. కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా మరియు సుర్వీన్ చావ్లా ప్రముఖ పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు