వచ్చే నెల నుండి రానా కొత్త సినిమా !

నేనేరాజు నేనేమంత్రి విజయం తరువాత రానా తెలుగులో చెయ్యబోతున్న సినిమాకు సంభందించిన ఒక వార్తా బయటికి వచ్చింది. ఏకే.ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలకు దర్శకత్వం వహించిన వంశి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ సినిమా ‘టైగర్ నాగేశ్వర్ రావ్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతోంది. టైగర్ నాగేశ్వర్ రావ్ ఓ గజ దొంగ. ఆంగ్లేయుల చేత రాబిన్ హుడ్ అనిపించుకున్న ‘టైగర్ నాగేశ్వర్ రావ్’ పాత్రలో రానా కనిపించనున్నాడు. గత నెలలోనే రానా ఈ సినిమాను చెయ్యడానికి అంగీకరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.