మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్దమైన రానా !

18th, October 2016 - 03:34:01 PM

rana-regina
తెలుగు పరిశ్రమలోని హీరోల్లో భాషతో పని లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకు పెద్ద పీఠ వేస్తున్న నటుడు రానా దగ్గుబాటి. ‘బాహుబలి’ చిత్రంతో మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు కూడా రానాను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే 1971 లో జరిగిన ఇండియా – పాక్ యుద్ధంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ‘ఘాజి’ చిత్రంలో నేవీ అధికారిగా రానా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24 న ఈ చిత్రం విడుదలకానుండగా ఇలాంటి చిత్రమే ఒకదానికి రానా సైన్ చేశాడు.

1940 ల కాలంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో జరిగిన కొన్ని ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రానా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫోజ్’ సైన్యంలో సభ్యుడిగా సైనికుడిగా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రేకేక్కుతునన్ ఈ చిత్రంలో రానాకు జోడిగా రెజీనా నటిస్తోంది. ఇందులో ఈమె సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిలా కనబడనుంది. తన పాత్ర గురించి రెజినా మాట్లాడుతూ ‘ఇందులో నేను కేవలం చీరల్లో మాత్రమే కనిపిస్తాను. మేకప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది’ అన్నారు. తెలుగులో 1945 అనే పేరుతో రానున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సత్య శివ డైరెక్ట్ చేస్తున్నాడు.