“విరాట పర్వం” పుకార్ల పై రానా కామెంట్స్

Published on Nov 10, 2021 8:24 pm IST


టాలీవుడ్ లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న రానా దగ్గుపాటి నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. పీరియడ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఉదుగుల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని సురేష్ బాబు మరియు సుధాకర్ చెరుకూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించకపోవడం తో ఓటిటి లో విడుదల అంటూ ఒక మీడియా పేజ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. భాషా పరమైన సమస్యల కారణంగా ఓటిటి లో విడుదల అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా చేసిన పోస్ట్ కి గానూ రానా దగ్గుపాటి స్పందించడం జరిగింది. రానా దగ్గుపాటి ఆ పోస్ట్ కి స్పందిస్తూ, ఈ భాషా సమస్యల పై నాకు అవగాహన కల్పించండి అని అన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :