“హను – మాన్” నుంచి హాలీవుడ్ లెవెల్ సూపర్ విలన్ ని రివీల్ చేసిన రానా.!

Published on Jun 8, 2022 10:08 am IST


తన ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ లెవెల్ ఇంప్రెషన్ ని తెప్పించుకున్న యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. తర్వాత ఒక్కో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా యంగ్ హీరో తేజ సజ్జ తో మరో సినిమా “హను – మాన్” ని పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసి భారీ హైప్ ని సెట్ చేసాడు. తనలోని క్రియేటివిటీని చూపిస్తూ ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో సినిమాగా మన తెలుగు నుంచి తీస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ విలన్ గా చేస్తున్న నటుడు వినయ్ రాయ్ లుక్ ని మేకర్స్ హల్క్ హీరో రానా దగ్గుబాటితో రివీల్ చేశారు. ఇక విజయ్ లుక్ కోసం మాట్లాడితే ఇది కంప్లీట్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మైఖేల్ గా తన సైన్యంతో ఓ హాలీవుడ్ సూపర్ విలన్ ని తలపించే లుక్ మరియు కాస్ట్యూమ్స్ లో కనిపిస్తునాడు.

అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో డ్రోన్స్ అవన్నీ చూస్తుంటే ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో ట్రీట్ మామూలుగా ఉండదు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే భారీ బడ్జెట్ తో కే నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :