ఆ నిర్మాత ఛీటింగ్ చేస్తాడంటున్న రానా

Rana Daggubati

నటుడు రానా ఇదివరకే స్టార్ట్ చేసిన సినిమాల్లో ‘1945’ కూడా ఉంది. ఈ సినిమాను కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎస్.ఎం.రాజరాజన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలై ఛాన్నాళ్లే కావొస్తోంది. మొదట్లో బాగాన నడిచిన ఈ ప్రాజెక్ట్ నుండి కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఉన్నట్టుండి ఈరోజు ప్రొడక్షన్ హౌజ్ త్వరలో సినిమా నుండి రానా ఫస్ట్ లుక్ రాబోతుందని ప్రకటన విడుదల చేసింది.

అది చూసిన రానా ఘాటుగా స్పందించారు. ఇది అసంపూర్తిగా మిగిలిపోయిన చిత్రం అని స్టార్ట్ చేసి నేను సంవత్సరంగా సినిమాకు సంభందించిన వారిని ఎవరినీ కలవలేదు. ఇది ఇంకొంతమందిని చీటింగ్ చేసి డబ్బును సమకూర్చుకునే ప్రయత్నమే. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దు అంటూ షాకిచ్చారు.

ఆయన మాటల్ని బట్టి నిర్మాత ఆర్థిక లావాదేవీల విషయంలో సక్రమంగా లేకపోవడంతో రానా ఆ సినిమా నుండి బయటకు వచ్చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇకపై ఆ సినిమా అదే నిర్మాత చేతిలో ఉంటే అందులో నటించే ఉద్దేశ్యం కూడా రానాకు లేదని స్పష్టమవుతోంది. మరి రానా చేసిన ఈ కామెంట్స్ పట్ల నిర్మాణ సంస్థ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Exit mobile version