
ఆరడుగుల ఆజానుభాహుడు, టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి గత రెండేళ్లుగా రెండు పీరియాడికల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. ఈ రెండిటి షూటింగ్ ఫినిష్ చేసిన రానా వరుసగా తన తదుపరి సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే రానా తమిళ బెంగుళూరు డేస్ రీమేక్ కి సైన్ చెయ్యడమే కాకుండా షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు. ఇది కాకుండా తాజాగా రానా ఓ క్రేజీ డైరెక్టర్ చేస్తున్న మరో తమిళ సినిమాకి సైన్ చేసాడు.
కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజున్న డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ యంగ్ స్టార్ హీరో శింబు హీరోగా ఓ సినిమా మొదలైంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం రానాని ఎంపిక చేసారు. పాత్ర నచ్చడంతో రానా కూడా ఓకే చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది, త్వరలో రానా ఈ చిత్ర టీం తో జాయిన్ అవుతాడు. రానా గత ఏడాదే నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సింది, కానీ అది మొదలవ్వలేదు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న రానా అత్వరలో తను సోలో హీరోగా చేయనున్న సినిమా మరియు దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కలిసి చేయనున్న సినిమాలు త్వరలో మొదలు కానున్నాయి.