సీనియర్ హీరోకి సపోర్ట్ చేస్తున్న రానా !

21st, September 2017 - 08:42:54 AM


ప్రెజెంట్ ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హీరోలందరూ తోటి హీరోల సినిమాలకు సపోర్ట్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా యువహీరోలు ఈ విషయంలో చాలా ముందున్నారు. విషయానికొస్తే ‘బాహుబలి’ తో జాతీయస్థాయి గుర్తింపు పొందిన రానా సీనియర్ హీరో డా. రాజశేఖర్ చిత్రం ‘పిఎస్వి గరుడావేగ’ కు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబదించిన టీజర్ ను రేపు 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు రానా తన అధికారిక ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమాకు ఇంకాస్త మెరుగైన ప్రచారం లభించే ఆస్కారముంది. రాజశేఖర్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తుండగా కోటేశ్వరరాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సన్నీ లియోనీ స్పెషల్ సాంగ్ చేస్తుండగా పూజ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.