సరికొత్త విశేషాలను రివీల్ చేయనున్న రానా !


స్టార్ నటుడు రానా నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత పూర్తి స్థాయి పాత్రలో రానా చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి నెలకొంది. అంతేగాక ఇటీవలే విడుదలైన టీజర్లు కూడా బాగుండటంతో సినిమాకు మంచి పాజిటివ్ ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయింది.

ఇకపోతే ఈ చిత్రానికి సంబందించి పలు విశేషాల్ని ఈరోజు రివీల్ చేస్తున్నట్టు రానా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విశేషాల్లో ట్రైలర్, ఆడియో వేడుక తేదీలతో పాటు సినిమా విడుదల తేదీ కూడా ఉండే అవకాశముంది. రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.