రానా సరసన కన్నడ బ్యూటీ!

29th, December 2017 - 08:31:43 AM

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న నటుడు రానా తమిళ సినిమాలపై కూడా కొంత ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్న రానా బాల డైరెక్షన్లో ఒక పిరియాడికల్ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానాకు జోడీగా కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటించనుందట. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్లో బిజీగా ఉన్న బాల అది పూర్తవగానే ఈ చిత్రాన్ని మొదలుపెడతారట. ఈ చిత్రంలో విశాల్, అనుష్క, ఆర్య, అరవింద స్వామి, ఆత్రవ మురళీ వంటి స్టార్ నటీ నటులు నటించనున్నారు.