కొత్త బిజినెస్ మొదలుపెట్టనున్న రానా !

rana
ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలు కొందరు టాలెంట్ ను ప్రోత్సహించడం, టాలెంట్ ఉన్నవారిని వెతికి పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నారు. ఇదొక మంచి వ్యాపారంగానే కాక కొత్తవారికి అవకాశాలు కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరో రానా ఇదే వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే రానా కొత్తగా టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడట.

దీని ద్వారా సినిమాలకు కావాల్సిన నటులను, సాంకేతిక నిపుణులను అందించే ప్రయత్నం చేస్తాడట. ఇందుకోసం ముంబైలో ఇప్పటికే ఉన్న ఒక కంపెనీ సంబందించిన ఆఫీసును హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నాడట. ఇకపోతే ఇదివరకే దర్శకుడు పూరి ‘పూరి కనెక్ట్స్’ పేరుతో ఇలాంటి ఒక టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.