బాలయ్యతో కాదు, రానాతో ప్లాన్ చేస్తునాడట ?

Published on Feb 7, 2022 12:30 pm IST

క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల బాలయ్యతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్యకి శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పాడని, బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే, తాజాగా ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రానాతో శ్రీకాంత్ అడ్డాల ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

మరి రానా ఇమేజ్ కోసం శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య వరుణ్ తేజ్ కూడా శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘నారప్ప’ సినిమా ప్రేక్షకులను బాగా అలరించడంతో శ్రీకాంత్ అడ్డాలకు డిమాండ్ పెరిగింది. ఆ చిత్రంలో కొత్త వెంకటేష్ ను చూపించాడు శ్రీకాంత్ అడ్డాల.

సంబంధిత సమాచారం :