రానా ‘విరాటపర్వం’ రిలీజ్‌పై లేటెస్ట్ టాక్..!

Published on Nov 17, 2021 2:42 am IST


దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం “విరాటపర్వం”. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల ఓటీటీలోనా లేక థియేటర్లలోనా అనేది గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నెలకొనగా ఇంత వరకు ఇందులో ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే సురేశ్ బాబు నిర్మాతగా ఉన్న ‘నారప్ప’ ఓటీటీలోనే విడుదల కాగా, ‘దృశ్యం 2’ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే రానా నటించిన ‘భీమ్లా నాయక్’ జనవరి 12వ తేదీన థియేటర్లకు రాబోతుంది. దీంతో భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత ‘విరాట పర్వం’ సినిమాను థియేటర్లకే తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారని లేటెస్ట్ టాక్. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More