రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 30, 2022 8:05 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం నటుడిగా ఒక్కో సినిమాతో పలు విజయాలను అందుకుంటూ తన ఆకట్టుకునే నటనతో ఎందరో ప్రేక్షకాభిమానుల నుండి మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ యానిమల్.

ఆకట్టుకునే కథ, కథనాలతో గ్రాండ్ లెవెల్లో టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థల పై రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని ఈ ఏడాది ఆఖరి రోజైన డిసెంబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సహా ఇతర భాషల ఆడియన్స్ లో కూడా యానిమల్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :