ఇంకొద్దిసేపట్లో రానా ఫస్ట్ లుక్ !

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి వరుసగా విభిన్న చిత్రాలకే సైన్ చేస్తున్నారు. వాటిలో ప్రస్తుతం చేస్తున్న ‘1945’ అనే సినిమా షూటింగ్ దశలో ఉండగా ఇంకో సినిమాని లైన్లో పెట్టారాయన. ఆ సినిమానే ‘హాతి మేరే సాతి’. ఈ చిత్రంలో రానా పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ఇంకొద్దిసేపట్లో అనగా ఈరోజు రాత్రి 12 గంటలకు ముందే రిలీజ్ కానుంది.

ఏనుగుల నైపథ్యంలో ఉండనున్న సాగే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రూపొందించనున్నారు.