డేట్ ఫిక్స్ చేసుకున్న రానా కొత్త సినిమా
Published on Sep 27, 2016 9:01 am IST

rana1
హీరో రానా నటిస్తున్న ‘ఘాజి’ చిత్రం శరవేగంగా పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 1971 లో జరిగిన ఇండియా – పాక్ యుద్ధంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందువల్లనే గ్రాఫిక్స్ కు సంబందించిన పనులు భారీ స్థాయిలో ఉండటం వలన అన్నింటినీ నిదానంగా పూర్తి చేసుకుని ఫర్ఫెక్ట్ గా ఫిబ్రవరి 24 కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా ఓ నేవీ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. హిందీలో కారం జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులిప్ పివిపి సంస్థ సమర్పిస్తోంది. మొట్టమొదటిసారి టాలీవుడ్ లో యదార్థ యుద్ధ ఘటనల నైపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే ఇందులో రానా కు జోడీగా తాప్సి నటిస్తోంది.

 
Like us on Facebook