రానా “విరాట పర్వం” ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

Published on Jun 3, 2022 6:00 pm IST


రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన విరాట పర్వం జూన్ 17, 2022 న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమా నిర్మాతలు సోషల్ మీడియాలో విరాట పర్వం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 5, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అదే విషయాన్ని ప్రకటించేందుకు సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పీరియాడికల్ డ్రామాలో ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రానా దగ్గుపాటి నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :