యానిమల్ మూడు పార్ట్ లు – రణబీర్ కపూర్

యానిమల్ మూడు పార్ట్ లు – రణబీర్ కపూర్

Published on Dec 10, 2024 12:00 AM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించి.. అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ మూవీ రెండో పార్ట్ షూటింగ్ 2027లో ప్రారంభం కానుందని హీరో రణ్‌బీర్ కపూర్ చెప్పారు. ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని.. అందుకే 2027లో స్టార్ట్ చేస్తాం అని రణ్‌బీర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే, యానిమల్‌కు పార్ట్-3 కూడా ఉంటుందని రణ్‌బీర్ వెల్లడించారు.

రెండో పార్ట్‌లో హీరో-విలన్ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందని.. ముఖ్యంగా పార్ట్-2 యానిమల్ పార్క్‌గా రాబోతుందని రణ్‌బీర్ తెలిపారు. ఐతే, ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ విమర్శలపై హీరో రణ్‌బీర్‌ కపూర్‌ స్పందించారు. ‘యానిమల్‌ విషయంలో అందరి అభిప్రాయాలతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐతే, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావాల్సిన బాధ్యత మా పై ఉంది. కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక నటుడిగా ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషిస్తారో.. అప్పుడే వారి కెరీర్‌ బాగుంటుంది’ అంటూ రణబీర్ తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు