తన రొమాంటిక్ సినిమాల పై రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 25, 2022 2:00 am IST

బాలీవుడ్ హ్యండ్సం హీరో రణబీర్ కపూర్ చాలా గ్యాప్ తర్వాత కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో షంషేరా అనే కొత్త చిత్రంతో తిరిగి వచ్చాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్ విజువల్స్ తో ట్రైలర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. టైటిల్ రోల్‌లో రణబీర్ కపూర్ అద్భుతంగా కనిపిస్తున్నాడు.

ట్రైలర్ లాంచ్‌లో రణ్‌బీర్ చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మేరకు తను మాట్లాడుతూ, రొమాంటిక్ పాత్రలు చేయడంతో విసిగిపోయాను, నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలని అనుకున్నా, అందుకే షంషేరా మరియు బ్రహ్మాస్త్ర లపై సంతకం చేశా అంటూ చెప్పుకొచ్చారు. షంషేరాలో సంజయ్ దత్ మరియు వాణి కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా భారీగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :