బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ రామాయణ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత అంతా పార్ట్ 2 నే తన నెక్స్ట్ సినిమా అనుకున్నారు కానీ మధ్యలో లవ్ అండ్ వార్ ని అనౌన్స్ చేశారు. అయితే తన లైనప్ లో ఇంకా అనిమల్ 2 మరియు బ్రహ్మాస్త్ర 2 సినిమాలు ఉన్నాయి.
వీటిలో విజువల్ వండర్ సీక్వెల్ బ్రహ్మాస్త్ర 2 మాత్రం ఏకంగా 2029 లోనే వచ్చే ఛాన్స్ ఉందట. రామాయణ 2 తర్వాత సందీప్ రెడ్డి వంగతో అనిమల్ పార్క్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాతే బ్రహ్మాస్త్ర 2 ని మొదలు పెట్టి 2029 ముగిసే నాటికి విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. సో ఈ భారీ విజువల్ వండర్ కోసం ఎదురు చూసేవారు ఇంకో మూడేళ్లు ఆగాల్సిందే అని చెప్పాలి.
