రణబీర్ కపూర్ “యానిమల్” టీజర్ అప్పుడే!

Published on Jun 6, 2023 5:36 pm IST

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ చివరిసారిగా లవ్ రంజన్ దర్శకత్వం వహించిన తూ ఝూటి మైన్ మక్కార్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం, అతను తన తదుపరి భారీ చిత్రం, యానిమల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఆగస్ట్ 11, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా మేకర్స్ టీజర్‌ను జూన్ 16, 2023న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

చాలా నెలలుగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లు లేదా గ్లింప్స్ వీడియోలు విడుదల కాలేదు. కాబట్టి బజ్ నమ్మితే, రణబీర్ మరియు సందీప్ వంగా ఇద్దరూ అభిమానులకి ఇది పండగే. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :