బాక్సాఫీస్ వద్ద దూకుడుగా రణబీర్ “తూ ఝూటి మైన్ మక్కర్”

Published on Mar 12, 2023 6:05 pm IST


బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల విడుదలైన తూ ఝూటి మైన్ మక్కర్‌ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హోలీకి విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మొదటి రోజు 15.73 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది ఈ తరహా చిత్రానికి చాలా బాగుంది. ఈ సినిమా వర్కింగ్ డేస్‌గా ఉన్నప్పటికీ రెండు, మూడు రోజుల్లో 20.8 కోట్ల రూపాయల వసూలు చేసింది.

ఈ చిత్రం నాలుగో రోజు సంచలన వృద్ధిని సాధించింది. బాక్సాఫీస్ వద్ద నాల్గో రోజు 16.57 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ 53.16 కోట్ల రూపాయలకి చేరాయి. ఈరోజు ఆదివారం కావడంతో సినిమా మరింత గ్రోత్‌ను చూపించే అవకాశం ఉంది. రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించగా, లవ్ రంజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :