డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ!

Published on May 2, 2023 3:30 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు శ్రద్ధా కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తూ ఝూటి మైన్ మక్కర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించింది. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధంగా ఉంది.

తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం మే 3, 2023 నుండి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా అధికారిక ప్రకటన విడుదలైంది. TJMM ఇటీవలే 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. లవ్ ఫిల్మ్స్ మరియు టి సిరీస్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మరియు హితేష్ సోనిక్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :