ఒక్కసారిగా రణబీర్ “యానిమల్” పై భారీ హైప్.!

ఒక్కసారిగా రణబీర్ “యానిమల్” పై భారీ హైప్.!

Published on Nov 24, 2022 9:00 AM IST

గత కొంత కాలం నుంచి కూడా బాలీవుడ్ సినిమా భారీ కం బ్యాక్ కోసం అయితే చూస్తుంది. మరి ఇప్పటికి అయితే పలు సినిమాలు పర్వాలేదు అనిపిస్తున్నా చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ ని షేక్ చేసే అసలైన సినిమా కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పుడు “దృశ్యం 2” ఇంప్రెసివ్ రన్ తో కొనసాగుతూ ఉండగా వచ్చే ఏడాది మాత్రం బాలీవుడ్ దగ్గర సినిమాల హవా గట్టిగా ఉండనుంది.

మరి అలా వచ్చే ఏడాది రానున్న చిత్రాల్లో మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో ప్లాన్ చేసిన సాలిడ్ యాక్షన్ డ్రామా “యానిమల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం పై అయితే ముందే మంచి అంచనాలు ఉన్నాయి కానీ లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన లీక్స్ తో అయితే సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి.

ఊహించని లుక్ లో రణబీర్ కనిపిస్తుండడంతో మరోసారి బాలీవుడ్ లో అదిరే సినిమా పడనుంది అని చర్చ స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడే ఇవన్నీ చెప్పుకోవడం అప్రస్తుతం కానీ ఈ సినిమాపై ఈ లీక్స్ తో హైప్ తార స్థాయికి చేరుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు