వైష్ణవ్‌ తేజ్‌ “రంగ రంగ వైభవంగా” విడుదల తేది ఫిక్స్..!

Published on Feb 11, 2022 10:00 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ తొలి చిత్రం “ఉప్పెన”తోనే భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత “కొండపొలం” సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‏గా “రంగరంగ వైభవంగా” సినిమా తెరకెక్కింది. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. మే 27న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :