వైష్ణవ్ తేజ్ “రంగ రంగ వైభవంగా”పై పాజిటివ్ వైబ్స్..!

Published on Aug 25, 2022 11:00 am IST

మెగా కాంపౌండ్ నుంచి మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో డెబ్యూట్ సినిమా తోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి సెన్సేషన్ ని నమోదు చేసాడు. ఇక దీని తర్వాత మంచి సబ్జెక్టు లను ఎంచుకుంటూ వస్తున్న ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా నటించిన మరో చిత్రమే “రంగ రంగ వైభవంగా”. నూతన దర్శకుడు గిరీశయ్య తెరకెక్కించిన ఈ చిత్రం ముందు నుంచి మంచి బజ్ ని తెచ్చుకుంది.

ఇక నిన్న రిలీజ్ అయ్యిన థియేట్రికల్ ట్రైలర్ తో అయితే ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్ మొదలయ్యినట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపిస్తుంది. మరి ఈ సెప్టెంబర్ 2 న అయితే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :