“రంగబలి” నుండి మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్ రిలీజ్!

Published on May 24, 2023 5:37 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య తదుపరి చిత్రం రంగబలిలో కనిపించనున్నాడు. ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పూర్తి వినోదాత్మక చిత్రం. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు పేరుగాంచిన ఎస్‌ఎల్‌వి సినిమాస్‌కు చెందిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది అనే మొదటి సింగిల్‌ని రిలీజ్ చేయడం జరిగింది. పవన్ సిహెచ్ యొక్క ఎనర్జిటిక్ బీట్‌లతో నాగ శౌర్య ఆకట్టుకుంటున్నారు.

ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను చాలా డైనమిక్‌గా పాడాడు. హీరో నాగ శౌర్య అద్దిరిపోయే స్టెప్పులు వేశాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాట ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటిస్తుంది. రంగబాలి షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం జూలై 7, 2023న. థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :