ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో ‘రంగమార్తాండ’ టీజర్

Published on Mar 18, 2023 10:07 pm IST

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రామకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రలు చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ మూవీ రంగమార్తాండ. మరాఠీ మూవీ నటసామ్రాట్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెల్సిందే. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను విశేషంగా ఆకట్టుకోగా, ఈ మూవీ ప్రీమియర్ ని ఇటీవల ప్రదర్శించగా అందరి నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఆ విధంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన రంగమార్తాండ టీజర్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు. సినిమాలోని ప్రధాన పాత్రధారులందరూ కనిపించిన ఈ టీజర్ ఎమోషనల్, హార్ట్ టచింగ్ అంశాలతో ఎంతో ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రంగమార్తాండ టీజర్ మరింతగా ఆకట్టుకోవడంతో తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :