“రంగ రంగ వైభవంగా” నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

Published on Feb 3, 2022 10:00 pm IST

ఉప్పెనతో భారీ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం “రంగరంగ వైభవంగా”. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి “తెలుసా తెలుసా” అనే ఫస్ట్‌ సింగిల్‌ విడుదల అయ్యింది.

శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించాడు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే అప్డేట్ రానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :