‘రంగరంగ విభవంగా’ ఒటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Published on Sep 27, 2022 10:46 pm IST


యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ మూవీ రంగరంగ వైభవంగా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కుటుంబాలు, వారి పిల్లల మధ్య ప్రేమానుబంధాలు, కొద్దిపాటి కలహాల నేపథ్యంలో సాగే ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్, రిషి పాత్రలో కనిపించగా రాధ పాత్రలో కేతిక నటించారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. సీనియర్ నరేష్, ప్రభు, తులసి, ప్రగతి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు అక్టోబర్ 2 నుండి ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి థియేటర్స్ లో పెద్దగా సందడి చేయని రంగరంగ వైభవంగా రేపు ఓటిటి లో రిలీజ్ తరువాత ఏ స్థాయి రెస్పాన్స్, వ్యూస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :