చివరి దశకు చేరుకున్న ‘రంగస్థలం 1985’ షూట్ !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం కొన్ని నెలల నుండి షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. 80 ల దశకంలో వాతావరణంలో జరిగే కథ కావడంతో పర్ఫెక్షన్ మిస్ కాకూడదని ఇన్ని రోజుల పాటు షూటింగ్ చేశారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం సెలవులో ఉన్న టీమ్ రేపు 3వ తేదీ నుండి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది.

ఈ షెడ్యూల్ జనవరి 12వ తేదీ వరకు జరగనుంది. అనంతరం ఇంకో బ్రేక్ తీసుకుని రాజమండ్రిలో కొన్ని పాటల్ని చిత్రీకరిస్తారు టీమ్. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.