మెగా అభిమానుల ఎదురుచూపులకు ఫులుస్టాప్ !
Published on Dec 7, 2017 8:28 am IST

మెగా అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అంశాల్లో ‘రంగస్థలం 1985’ ఫస్ట్ లుక్ కూడా ఒకటి. సినిమా మొదలై షూటింగ్ కూడా పూర్తి కావొస్తున్నా చిత్ర యూనిట్ కేవలం టైటిల్ లోగోతోనే సరిపెట్టి అభిమానులను ఊరిస్తూ వస్తోంది. దీంతో ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులకు ఫులుస్టాప్ పెడుతూ ఫస్ట్ లుక్ ను రేపు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సృజనాత్మక దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్లో చరణ్ కు జోడీగా సమంత నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook