రూ. 100 కోట్లు క్రాస్ చేసిన ‘రంగస్థలం’ !

‘రంగస్థలం’ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు సాలిడ్ హిట్ ను అందించింది. ‘మగధీర’ తరవాత ఆ స్థాయిలో విజయం లేకపోవడంతో కొంత డీలా పడిన చరణ్ ఈ సక్సెస్ తో సంతోషంలో మునిగిపోయారు. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం మొదటి నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.43.78 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక ఓవర్సీస్లో 2.45 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ‘బాహుబలి’ తరవాత అంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఇదే కావడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే నాటికి వసూళ్ల పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.