చివరి దశ షూటింగ్ కు సిద్దమైన ‘రంగస్థలం 1985’ !

5th, November 2017 - 01:28:39 PM

రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం 1985’ చివరి దశ షూటింగుకు చేరుకుంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన పల్లెటూరి సెట్లో ఈ చివరి షెడ్యూల్ జరగనుంది. ఇందులో రామ్ చరణ్, సమంత లపై కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జరపనున్నారు. ప్రసుతం హాలీడేలో ఉన్న సమంత తిరిగిరాగానే షూట్లో పాల్గొనననుంది. ఈ షెడ్యూల్ తో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది.

నటీనటుల లుక్ దగ్గర్నుండి సెట్ ప్రొపర్టీస్ వరకు అన్నింటిలోను 1980 ల కాలం నాటి వాతావరణం కనబడేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది మార్చి నెలకు విడుదలచేసే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి తర్వాతి ప్రాజెక్టును మొదలుపెట్టాలనే యోచనలో ఉన్నాడు రామ్ చరణ్.