రంగస్థలం టిజర్ అప్పుడేనా ?

26th, December 2017 - 08:55:27 AM

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా రంగ‌స్థ‌లం 1985. ఈ మూవీ లో సమంత కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ మద్య విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. మార్చి 30 న ఈ సినిమాను విడుదల చేస్తునట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజా సమాచారం మేరకు ఈ మూవీ టిజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. విలేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనసూయ, ఆది పినిశెట్టి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.