రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడంటే !
Published on Sep 22, 2017 11:21 pm IST

రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈనెల 30 న దసరా పండగకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితిల్లో సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. కాగా దేనికి సంబందించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook