రేంజ్ రోవర్ టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేసిన నటుడు అలీ..!

రేంజ్ రోవర్ టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేసిన నటుడు అలీ..!

Published on May 19, 2022 6:44 PM IST


ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఆట సందీప్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా రేంజ్ రోవర్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నటుడు అలీ విడుదల చేశారు. మేఘన రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి రాజ్ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది.

ఓఎస్ఆర్ కుమార్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో చిత్ర ట్రైలర్, సాంగ్స్ ను యూనిట్ విడుదల చేయనుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఓఎస్అర్ కుమార్ దర్శకత్వంలో.. ఆట సందీప్ చేస్తున్న ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాను. రేంజ్ రోవర్ టైటిల్ బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయం చేస్తారని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు