నాని “అంటే సుందరానికి” నుండి రంగో రంగ లిరికల్ వీడియో కి టైమ్ ఫిక్స్!

నాని “అంటే సుందరానికి” నుండి రంగో రంగ లిరికల్ వీడియో కి టైమ్ ఫిక్స్!

Published on May 22, 2022 7:30 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. నాని సరసన ఈ చిత్రం లో నజ్రియా నజీం హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి మరో లిరికల్ వీడియో ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రంగో రంగ లిరికల్ వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు మరోసారి టైం ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని జూన్ 10 వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు