రాణి ముఖర్జీ లేటెస్ట్ మూవీకి రెండో రోజు పెరిగిన వసూళ్లు!

Published on Mar 19, 2023 7:26 pm IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ కొత్త చిత్రం Mrs. ఛటర్జీ Vs నార్వే భారతీయ దంపతులకు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు. తొలిరోజు ఈ సినిమా 1.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు స్పీడ్ పుంజుకుని 2.27 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల టోటల్ ఇప్పుడు 3.53 కోట్ల నికరగా ఉంది.

ఈరోజు ఆదివారం కావడంతో సినిమా మళ్లీ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్భ్ మరియు నీనా గుప్తా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఎమ్మే ఎంటర్టైన్‌మెంట్ మరియు జీ స్టూడియోస్ నిర్మించిన లీగల్ డ్రామాకి అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :