తెలుగులో కూడా అదిరిపోయిన “రంజితమే”.!

తెలుగులో కూడా అదిరిపోయిన “రంజితమే”.!

Published on Nov 30, 2022 9:59 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వరిసు”. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరక్కిస్తున్నా ఈ చిత్రం తెలుగులో అయితే “వారసుడు” పేరిట రిలీజ్ కానుంది. ఇక తెలుగులో కూడా మంచి బజ్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అయితే తెలుగులో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు.

తమిళ్ లో ఆల్రెడీ సూపర్ హిట్ అయినటువంటి “రంజితమే” కి తెలుగు వెర్షన్ కి ఈరోజు రిలీజ్ చెయ్యగా మరి ఇది కూడా అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. తమిళ్ లిరిక్స్ కి విజయ్ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ కాగా తెలుగులో సాహిత్యానికి అయితే అనురాగ్ కులకర్ణి గాత్రం మరింత ఇంపుగా అనిపిస్తుంది.

అలాగే రామజోగయ్య శాస్త్రి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇచ్చిన పదాలు కూడా సాంగ్ లో బాగున్నాయి. ఓవరాల్ గా మాత్రం ఈ సాంగ్ తెలుగులో కూడా ఇన్ స్టాంట్ హిట్ ట్రాక్ చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు