ఇన్స్టాలో ‘రంజితమే’ సెన్సేషన్.!

ఇన్స్టాలో ‘రంజితమే’ సెన్సేషన్.!

Published on Dec 17, 2022 3:00 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “వారిసు” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం తెలుగులో అయితే “వారసుడు” గా రిలీజ్ కానుండగా ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అయితే మంచి హిట్స్ గా కూడా నిలిచాయి. సంగీత దర్శకుడు థమన్ మరియు విజయ్ ల కాంబినేషన్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ తోనే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

రంజితమే అంటూ వచ్చిన ఈ సాంగ్ అదిరే రెస్పాన్స్ ని అందుకుంది. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్ ఆల్రెడీ మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోగా లేటెస్ట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ అదరగొట్టింది. ఈ సాంగ్ ఇన్స్టా లో అయితే లక్ష కి పైగా రీల్స్ చేశారట. దీనితో అయితే ఈ సినిమా క్రేజ్ ఆడియెన్స్ లో ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు