యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకు పోతున్న “రంజితమే”

యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకు పోతున్న “రంజితమే”

Published on Nov 27, 2022 10:28 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ వచ్చే పొంగల్ సీజన్‌కి వరిసు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల రాబోతున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ రంజితమే ఇటీవలే విడుదలైంది. ఆ పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మ్యూజికల్ సెన్సేషన్ థమన్ క్యాచీ ట్యూన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు మరియు చాలా మంది డ్యాన్స్ రీల్స్ కూడా చేస్తున్నారు. ఈ పాట యూట్యూబ్‌లో 70 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ రాబోయే రోజుల్లో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. స్టార్ నటి రష్మిక మందన్న ఈ సినిమా లో కథానాయికగా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, జయసుధ, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు