పాన్ ఇండియా లెవెల్లో రణ్వీర్ అవైటెడ్ సినిమా ’83’ ఫిక్స్!

Published on Sep 26, 2021 3:03 pm IST

బాలీవుడ్ లో అద్భుతమైన టాలెంట్ కలిగిన అతి తక్కువ మంది స్టార్ హీరోస్ లో రణ్వీర్ సింగ్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలకి అయినా కూడా న్యాయం చెయ్యగలిగే ఈ నటుడు ఎప్పుడు నుంచో చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “83”. ఇండియన్ సినిమా దగ్గర బయోపిక్ ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్లాన్ చేసిన సినిమా ఇది. దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా పరిస్థితులు మూలన చాలా ఆగాల్సి వచ్చింది.

మరి ఎట్టకేలకు మేకర్స్ నుంచి ఇప్పుడు ఒక సాలిడ్ అనౌన్సమెంట్ అయితే వచ్చింది. ఈ చిత్రాన్ని ఒక్క హిందీలోనే కాకుండా మొత్తం పాన్ ఇండియన్ లెవెల్లో వచ్చే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ప్రకటించారు. మరి ఈ రేస్ లో ఇప్పటికే పలు బడా సినిమాలు కూడా సమయం ఫిక్స్ చేసుకున్నాయి. మన నుంచి పుష్ప కూడా ఉంది. మరి ఈ డిసెంబర్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ నమోదు అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :