క్రేజీ కాంబినేషన్ లో ఫుల్ ఎంటర్ టైనర్ !

Published on Oct 19, 2020 12:00 pm IST

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి – రణ్వీర్ సింగ్ లు కలిసి 2018లో ‘సింబా’ సినిమాకు పనిచేశారు. కాగా మళ్ళీ వీరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రం అట. ఈ చిత్రంతో ‘గోల్మాల్’ ఫ్రాంచైజీ కన్నా భారీ వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలని రోహిత్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకు సర్కస్ అని టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఇక తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అంద‌రినీ అల‌రిస్తోన్న పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికిపూజా స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ నిర్మాత‌లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అన్నట్టు ఈ కామెడీ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమాని రోహిత్ శెట్టితో పాటు భూషణ్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More