అలాంటి పాప వ‌స్తే నా జీవితం అద్భుతం – ర‌ణ్‌ వీర్

Published on Oct 18, 2021 7:03 am IST

బాలీవుడ్‌ స్టార్ కపుల్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న క్రేజీ కపుల్ దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు. అయితే, తమ సినీ కెరీర్ లో ఎంతో బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్ కు కూడా ప్రత్యేక టైం కేటాయిస్తున్నారు. ఇక ఈ బిజీ షెడ్యూల్‌లో ర‌ణ్‌ వీర్ ఓ షోకి హోస్ట్‌ గా చేస్తున్నాడు.

ర‌ణ్‌ వీర్ చేస్తోన్న షో పేరు ‘ది బిగ్ పిక్చ‌ర్‌’. కలర్స్ టీవీలో ప్ర‌సారం కానున్న ఈ షో ప్రోమో రిలీజ్ అయింది. అయితే, ఈ ప్రోమోలో ఓ కంటెస్టెంట్‌ తో ర‌ణ్‌వీర్ మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లి అయిందని తెలుసు కదా. రెండు, మూడు సంవత్సరాల్లో మాకు పిల్లలు కూడా పుడతారు. మీ వదిన చాలా క్యూట్‌ గా ఉంటుంది. నేను చాలాసార్లు నీలాంటి పాప‌ని నాకు ఇవ్వు. నా లైఫ్ సెట్ అయిపోతుంద‌ని అడుగుతుంటా. పాప వ‌స్తే నా జీవితం అద్భుతంగా మారుతుంది’ అంటూ ర‌ణ్‌వీర్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :