బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘దురంధర్’ (దురంధర్: ది రివెంజ్) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ ఊరమాస్ యాక్షన్ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఫాలో అయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌ను ఎంచుకున్నారు.
ఓవర్సీస్లో అన్‌కట్ వెర్షన్..
సెన్సార్ కట్స్ లేకుండా ‘రా అండ్ అన్దేఖా’ (Raw & Undekha) పేరుతో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల్లో మే 14 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతూ గ్లోబల్ చార్ట్స్‌లో ట్రెండ్ అవుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి ఆసియా దేశాలతో పాటు యూరప్, ఆఫ్రికా ఖండాల్లోనూ అదరగొడుతోంది. ఇక ఓవర్సీస్లోని తెలుగు ప్రేక్షకుల కోసం మే 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘దురంధర్’ తెలుగు వెర్షన్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇండియాలో జియో హాట్‌స్టార్‌లో..
ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇండియాలో మాత్రం ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయలేదు. భారతీయ ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. జూన్ 4 నుంచి ఈ బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఫిల్మ్ జియో హాట్‌స్టార్‌లో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, అలాగే ఆదిత్య ధర్ టేకింగ్, రణ్వీర్ సింగ్ యాక్షన్‌ను మళ్లీ స్క్రీన్‌పై చూడాలనుకునే వాళ్లు ఈ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
