‘బెంగాల్ టైగర్’తో జత కలిసిన రాశి ఖన్నా

Rashi-Khanna
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు కుర్రకారు మదిని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా గోపీచంద్ సరసన చేసిన ‘జిల్’ సినిమాతో గ్లామర్ అవతారం ఎత్తి హాట్ బ్యూటీగా కూడా యువతను ఆకట్టుకుంది. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో బిజీ గా ఉంది. అందులో రామ్ సరనస చేస్తున్న శివ సినిమా, మాస్ మహారాజ్ రవితేజ సరసన చేస్తున్న ‘బెంగాల్ టైగర్’ సినిమాలు సెట్స్ పై ఉంటే, త్వరలోనే సాయి ధరమ్ తేజ్ సినిమా సేస్ట్ పైకి వెళ్లనుంది.

గత కొద్ది రోజులు వరకూ అరకులో రామ్ తో రొమాన్స్ చేసిన రాశి ఖన్నా నేటి నుంచి రవితేజ సెట్లో సందడి చేయనుంది. బెంగాల్ టైగర్ షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. నేటి నుంచి రవితేజ – రాశి ఖన్నా ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఆగష్టుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్. రాశి ఖన్నా ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న రెండు సినిమాలు తనకి మంచి బ్రేక్ ఇస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

Exit mobile version