బ్లాక్ బస్టర్ మూవీ మనం సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేయడం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రాశి ఖన్నా . ఆతరువాత ఆమె ఊహలు గుసగుసలాడే అనే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేశారు. కెరీర్ ప్రారంభం నుండి మితి మీరిన గ్లామర్ రోల్స్, స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. అలాంటి రాశి ఒక్కసారిగా బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంతో రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ నిన్న విడుదలైంది. ఆ టీజర్ లో రాశి ఖన్నా మునుపెన్నడూ చూడని గెటప్ లో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురిచేశారు.
ఆమె టాప్ లెస్ బ్యాక్ షాట్ లో స్నానం చేస్తూ కనిపించడంతో పాటు, విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఇంటిమసీ సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. విజయ్ దేవరకొండను అమితంగా ప్రేమించే యామిని అనే అమ్మాయిగా రాశి ఖన్నా కనిపిస్తుంది. టీజర్ లో ఆమె బోల్డ్ నెస్ చూసిన ఫ్యాన్స్ విజయ్ కోసం రాశి తన గత ఇమేజ్ ని వదిలివేసింది అనుకుంటున్నారు. ఏదిఏమైనా టీజర్ తో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంపై అంచనాలు పెంచేశారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. వచ్చే నెల 14న వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు కానుకగా విడుదల అవుతుంది.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
