మనకు ఈ భూమ్మీద ఉండే అర్హత లేదు – ‘రష్మి గౌతమ్

Published on Oct 4, 2021 9:09 am IST

బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘రష్మి గౌతమ్’ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే, రష్మి జంతు ప్రేమికురాలు. ‘మనుషులకు ఆకలేస్తే నోరు తెరిచి అడుగుతారు. కానీ.. మూగ జీవాలు అడగలేవు కదా’ అంటూ కరోనా సమయంలో ఆమె ఎన్నో వీధి కుక్కల ఆకలి తీర్చారు. అయితే తాజాగా ఓ నెటిజన్‌ పంచుకున్న ఓ వీడియో చూసి ఆమె కలత చెంది ఎమోషనల్ గా రియాక్ట్ అయింది.

‘ఈ వీడియోను మధ్యప్రదేశ్‌ లోని దివాస్‌ లో షూట్ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు వీధి కుక్కను తాడుతో కట్టి, దాన్ని చావబాదారు. సుమారు 30 నిమిషాల పాటు అలా కొట్టి చంపారు’ అంటూ ఓ నెటిజన్ రష్మిని ట్యాగ్ చేశారు. ‘ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారన్నమాట. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. మనకు ఈ భూమ్మీద ఉండే అర్హత లేదు’ అంటూ విలపిస్తున్న ఇమోజీని పోస్ట్ చేసింది రష్మీ.

సంబంధిత సమాచారం :