ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప దేశ వ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. ఈ సాంగ్ కి 73 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 2 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ రెస్పాన్స్ పట్ల హీరోయిన్ రష్మిక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నైస్, ఇది పుష్పరాజ్ మ్యానియా అంటూ చెప్పుకొచ్చారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా బాషల్లో థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Naaaaiiicccceeee! ????????
It’s the #PushpaRaj mania ! ????@alluarjun @ThisIsDSP @aryasukku #FahadhFaasil @SukumarWritings @MythriOfficial @TSeries https://t.co/u273Fv1KoQ— Rashmika Mandanna (@iamRashmika) May 10, 2024